
జాడలేని వరుణుడు
పెందుర్తి: ఏటా ఆషాడ చతుర్దశి నాడు ‘గోవింద’నామస్మరణతో గిరి చుట్టూ తిరిగే సింహాద్రి అప్పన్న భక్తులను వరుణుడు పలకరించడం పరిపాటి. ఎంతలా అంటే గిరి ప్రదక్షిణ రోజు తప్పకుండా వర్షం పడుతుంది అన్నంతగా భక్తుల్లో నాటుకుపోయింది. కానీ ఈ ఏడాది భక్తులకు వరుణుడు మొహం చాటేశాడు. బుధవారం ఉదయం నుంచీ భానుడు నిప్పులు కురిపించాడు. దాదాపు 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతతో భక్తులు ఆపసోపాలు పడ్డారు. అయితే ప్రతీ ఏడాది లాగే సాయంత్రానికి వర్షం పడుతుందన్న ఆశతో ఎదురుచూసిన భక్తులకు నిరాశే ఎదురైంది. రోజంతా చుక్క వాన కాదు కదా కనీసం ఎక్కడా మేఘావృతం కూడా కనిపించలేదు.