
నీటి వసతి ఉంటే అయిల్‌పామ్ సాగు మేలు
నాతవరం: ఆయిల్ పామ్ తోటలు సాగు చేయడం ద్వారా అన్ని విధాలుగా బాగుంటుందని వైఎస్సార్‌సీపీ సినియర్ నేత రాష్ట్ర అయిల్ ఫామ్ కార్పోరేషన్ మాజీ డైరెక్టరు పైల పోతురాజు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయిల్‌పామ్ తోటల విస్తరణ మహోత్సవం సందర్భంగా అయిల్‌పామ్ తోటలు సంఘం జిల్లా అద్యక్షుడు పి.వి.సీతారామరాజు ఆధ్వర్యంలో రైతులు సమావేశం నిర్వహించారు. పోతురాజు మాట్లాడుతూ తాను 1997 సంవత్సరం నుంచి అయిల్‌పామ్ తోటలు సాగు చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టరుగా పని చేశానని, ఆ సమయంలో ఆయిల్‌పామ్ ధర బాగుందన్నారు. ప్రస్తుతం ఇతర వ్యవసాయ పంటలతో పోల్చుకుంటే అయిల్‌పామ్ తోటలు సాగు చేయడం లాభదాయకమన్నారు. కూలీల సమస్యతో పాటు దళారులు ఉండరని మార్కెట్ సదుపాయం ఉంటుందని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సీతారామరాజు మాట్లాడుతూ నీటి వసతి ఉన్న భూములలో అయిల్‌పామ్ తోటలు వేసేందుకు అసక్తి చూపాలని తోటలో అంతర పంటలు వేయాలన్నారు. పంతాంజలి సంస్థ మేనేజర్ చంద్రశేఖర్, కె.రమేష్ యాంత్రీకరణ, ఎరువుల వాడకం, గెలల కోత తదితర అంశాలపై రైతులకు వివరించారు. తాండవ ప్రాజెక్టు మాజీ చైర్మన్ పారుపల్లి కొండబాబు, వల్సంపేట సర్పంచ్ ఇట్టంశెట్టి శ్యామల, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత శ్రీనివాస్ పామాయిల్ కంపెనీ అసిస్టెంటు మేనేజరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.