
సంపద తయారీ కేంద్రాలతో అదనపు ఆదాయం
వెంకటాపురంలో పర్యటిస్తున్న
జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి
మునగపాక: సంపద తయారీ కేంద్రాల ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. మండలంలోని వెంకటాపురంలో మంగళవారం ఆయన పర్యటించారు. గ్రామంలో పారిశుధ్యం అమలు తీరుతో పాటు సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఇంటి ముందు నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా బుట్టలో వేసుకోవాలన్నారు. సర్పంచ్ సుందరపు తాతాజీ, ఎంపీడీవో ఎం.ఉషారాణి, ఈవోఆర్డీ సోమరాజు, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.