
చికిత్స పొందుతూ క్షతగాత్రుడు మృతి
కశింకోట: కశింకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ కె.లక్ష్మణరావు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక గ్రామీణ వికాస బ్యాంకు వద్ద తేగాడ వైపు వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి టాటా ఏస్ వాహనం ఈ నెల 3న ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న తేగాడకు చెందిన మామిడి బాబు(58) తీవ్రంగా గాయపడడంతో అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య చిన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.