
రహదారి నిర్మాణంలో పక్షపాతం
అనకాపల్లి మండలంలో కె.ఎన్.ఆర్.పేట వార్డు సచివాలయం నుంచి మేతపేటలో కొత్తగా సిమెంట్ రోడ్డు నిర్మించారు. అయితే ఎలుగుబంటి అప్పారావు ఇంటి నుంచి పెంకుటిళ్లు దగ్గర పదడుగులు రహదారి వేయవలసి ఉన్నప్పటికీ ఆరు అడుగులు మేర అసంపూర్తిగా వేశారు. రోజూ చెత్త వాహనాలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్‌కు పూర్తి స్థాయిలో బిల్లులు కూటమి నేతలు చెల్లించారు. దీనిపై నాలుగు సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు.
– ఎలుగుబంటి సత్యారావు, కె.ఎన్.ఆర్.పేట, అనకాపల్లి మండలం
●