
క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
కోటవురట్ల: మండలంలోని రాజుపేట శివారు రామన్నపాలేనికి చెందిన పీతల వరహాలబాబు(42) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి.. మద్యానికి బానిసై అతడు తరచూ భార్యా పిల్లలతో గొడవపడేవాడు. మేకల మందలోని మేకలను అమ్మేసి మద్యం వ్యసనానికి బానిసయ్యాడు. ఇదే విషయమై ఆదివారం రాత్రి భార్య, పిల్లలతో గొడవపడ్డాడు. మనస్తాపం చెంది సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మేకల మంద దొడ్డిలో పురుగుల మందు తాగి తన కుమారుడికి ఫోన్ చేసి ‘మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నాను, ఇక మీకు నా బాధ ఉండదు’ అంటూ తాను పురుగుల మందు తాగిన విషయాన్ని చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని స్థానిక సీహెచ్‌సీకి తరలించగా పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. భార్య గంగ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు.

క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి ఆత్మహత్య