
మాజీ ఎమ్మెల్యే గణేష్‌కు పరామర్శ
మాజీ ఎమ్మెల్యే గణేష్‌ను పరామర్శిస్తున్న మాజీ మంత్రి, పార్టీ అధ్యక్షుడు అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు, నాయకులు
నర్సీపట్నం: మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌ను మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజు శనివారం పరామర్శించారు. ఐదు రోజులుగా విష జ్వరంతో బాధపడుతున్న గణేష్ విశాఖ మెడికవర్ హాస్పిటల్‌లో వైద్యం పొందుతున్నారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరామర్శలో వైఎస్సార్‌సీపీ నాయకుడు శరగడం చిన అప్పలనాయుడు, యలమంచిలి ఎంపీపీ గోవింద్, తదితరులు ఉన్నారు.