
ఇంటర్ విద్య పూర్తి చేయాలనుకునే విద్యార్థులకు అవస్థలు త
● అధ్యాపకుల్లేని కొరుప్రోలు జూనియర్ కళాశాల ● గతేడాది హైస్కూల్ ఉపాధ్యాయుల బోధనే దిక్కు ● ఈ ఏడాదీ లెక్చరర్స్ నియామకంపై మీనమేషాలు ● విద్యార్థులకు తప్పని అవస్థలు
ఎస్.రాయవరం:
గత విద్యా సంవత్సరానికి ముందు మండలంలోని కొరుప్రోలు ఉన్నత పాఠశాలను అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జూనియర్ కళాశాల మంజూరు చేసింది. మొదటి ఏడాది ఎంపీసీ, బైపీపీ కలిపి 51 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఆ సమయంలో ఎన్నికలు రావడంతో తాత్కాలిక అధ్యాపకులను నియమించి మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠాలు బోధించారు. అప్పటి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పని చేసిన సకురు సత్యనారాయణ కృషి ఫలితంగా మొదటి సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క అధ్యాపకుడిని కూడా నియమించలేదు. ఈ ఏడాది మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీపీ కలిపి 20 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరంతా రోజూ కళాశాలకు రావడం.. కబుర్లు చెప్పుకొని వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. మరోవైపు అధ్యాపకులు వస్తారని, కంగారు పడొ ద్దని హైస్కూల్ ఉపాధ్యాయులు చెబుతున్నారు.
టీసీల కోసం ఒత్తిడి
ఈ కళాశాలలో ఉంటే ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత సాధించడం కష్టమని పలువురు విద్యార్థులు టీసీలు ఇవ్వాలని కళాశాల నిర్వాహకులపై ఒత్తిడి చేస్తున్నారు. నెల రోజులుగా కళాశాలకు వచ్చినా ఒక పాఠం కూడా చెప్పకపోవడంతో పలువురు పూర్తిగా రావడం మానేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులు ఇద్దరు మాత్రమే కళాశాలకు వచ్చి కూర్చుని వెళ్లిపోతున్నారు. విద్యార్థులకు 10వ తరగతి తరువాత అత్యంత కీలకం ఇంటర్మీడియట్ చదువు. అయితే కొరుప్రోలు కళాశాల విద్యార్థులు విద్యా బోధన ఈ ఏడాది కూడా గాల్లో దీపంలా తయారైంది.
ఈ సమస్యను ఉపాధ్యాయులు స్థానికంగా ఉన్న హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లారు. వి ద్యాశాఖ ఉన్నతాధికారులకు కూడా పరిస్థితిని వివరించారు. అయినా అధ్యాపకులను నియమించలేదు.

ఇంటర్ విద్య పూర్తి చేయాలనుకునే విద్యార్థులకు అవస్థలు త