
మరో కళాశాలలో జాయిన్ అవ్వక తప్పదు
నేను 10వ తరగతి చదివిన పాఠశాలలో జూనియర్ కళాశాల వచ్చిందని చాలా ఆనందంగా జాయిన్ అయ్యాను. మొదటి సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేరు. హైస్కూల్ ఉపాధ్యాయుల బోధనతో నెట్టుకొచ్చాం. మొదటి సంవత్సరం పాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించాం. ద్వితీయ సంవత్సరం కళాశాల తెరిచి నెల రోజులైనా లెక్చలర్స్ రాలేదు. మా అమ్మ టీసీ తీసుకుని మరో కళాశాలలో జాయిన్ చేస్తామని చెప్పింది. కొత్త హెచ్‌ఎం సార్ కొన్ని రోజులు ఆగమన్నారు. లెక్చలర్స్ రాకపోతే మరో కళాశాలకు వెళ్లక తప్పదు.
– కె.మాన్విత, ద్వితీయ సంవత్సరం విద్యార్థి, కొరుప్రోలు కళాశాల
●