
నెల రోజులుగా విద్యార్థులను ఆపుతున్నాం..
కళాశాల ఏర్పాటుతో పాటు సిబ్బందిని, అధ్యాపకులను ప్రభుత్వం నియమించాలి. గతేడాది తాత్కాలికంగా నియమితులైన లెక్చరర్స్ ఈ ఏడాది కొనసాగేలా ఆదేశాలు విద్యా శాఖ నుంచి రాలేదు. ఈ ఏడాది కొత్తగా నియమిస్తారని ఎదురు చూస్తున్నాం. నెల రోజులుగా విద్యార్థులు మరో కళాశాలకు వెళ్లకుండా ఆపుతున్నాం. ఇప్పటికై నా అధ్యాపకులను నియమిస్తే పాఠాలు బోధన పూర్తి స్థాయిలో జరుగుతాది. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తాత్కాలికంగా చెప్పాలని సూచించాం. సమయం చాలడం లేదని చెబుతున్నారు. సమస్యపై అధికారులకు మరోమారు నివేదిస్తాం.
– కె.ప్రసాద్, ప్రధానోపాధ్యాయుడు, కొరుప్రోలు కళాశాల నిర్వాహకులు