
అల్లూరి ఆశయ సాధనకు పాటుపడాలి
● అరకు ఎంపీ తనూజారాణి పిలుపు
మునగపాక: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అరకు ఎంపీ జి.తనూజారాణి పిలుపునిచ్చారు. అల్లూరి జయంతిలో భాగంగా శుక్రవారం స్థానిక బొడ్డేడ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అల్లూరి చిత్రపటానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్‌తో కలిసి ఆమె పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అల్లూరి పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి చూపిన పోరాట ప్రతిభ మార్గదర్శకం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు దిమ్మల అప్పారావు, బొడ్డేడ శ్రీనివాసరావు, భీశెట్టి గంగప్పలనాయుడు, మాజీ వైస్ ఎంపీపీ దొడ్డి వరహా సత్యనారాయణ, పార్టీ నేతలు దాసరి అప్పారావు, నరాలశెట్టి సూర్యనారాయణ, పిన్నమరాజు రవీంద్రరాజు, ఆడారి రమణబాబు, జేసీబీ వెంకట్, కన్నుంనాయుడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి పోరాటం.. అద్భుత అధ్యాయం
అనకాపల్లి: అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాటం భారత స్వాతంత్య్ర చరిత్రలో అద్భుతమైన అధ్యాయంగా నిలిచిపోయిందని జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్‌రావు అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం విప్లవ యోధుడు అల్లూరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారామరాజు జయంతి తెలుగు ప్రజలకే కాకుండా దేశం మొత్తం గర్వపడే రోజని కొనియాడారు. బ్రిటిష్ అధికారుల దమన, దౌర్జన్య విధానాలను ఎదిరిస్తూ, గిరిజనుల హక్కులను కాపాడేందుకు తన ప్రాణాలను అర్పించిన మహనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు టి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, రమేష్, గఫూర్, ఎస్‌ఐలు సురేష్ బాబు, వెంకన్న, శిరీష, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అల్లూరి స్ఫూర్తి యువతకు మార్గదర్శకం
తుమ్మపాల: అల్లూరి సీతారామరాజు త్యాగం, పోరాట పటిమ నేటి యువతకు మార్గదర్శకమని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప సమరయోధుడు అల్లూరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్‌వీఎస్ సుబ్బలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ డిపో మేనేజర్ పి.జయంతి, జిల్లా పరిషత్ కార్యనిర్వాహక ఇంజినీర్ వీరునాయుడు, కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి, భూపరిపాలన, సమన్వయ, మేజిస్ట్రియల్ విభాగాలకు చెందిన పర్యవేక్షకులు విజయ్‌కుమార్, పి.వి. రత్నం, ఎస్‌ఎస్‌వీఎస్ నాయుడు, రాజేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి ఆశయ సాధనకు పాటుపడాలి

అల్లూరి ఆశయ సాధనకు పాటుపడాలి