
సీతంపేటలో కుక్కల స్వైర విహారం
కుక్కల దాడిలో చనిపోయిన నాటు కోడి, (ఇన్‌సెట్) వీధి కుక్కల దాడిలో చిన్నారి కాలికి గాయం
దేవరాపల్లి: మండలంలోని నాగయ్యపేట పంచాయతీ శివారు సీతంపేటలో వీధి కుక్కలు శుక్రవారం స్వైర విహారం చేశాయి. చిన్నారులతో పాటు కోళ్లు, లేగదూడలపై సైతం దాడులు చేశాయి. వీటి దాడిలో గ్రామానికి చెందిన పుల్లి జామయ్య, కింతాడ చంటి నాటు కోళ్లు మృత్యవాత పడ్డాయి. ఎలుసూరి బుజ్జి అనే చిన్నారి వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికై నా పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు స్పందించి వీధి కుక్కల నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సీతంపేటలో కుక్కల స్వైర విహారం