
నేడు అల్లూరి విగ్రహావిష్కరణ
నర్సీపట్నం: అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ఏర్పాట్లను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం పరిశీలించారు. పట్టణంలో క్షత్రియ పరిషత్ వారు రూ.25 లక్షలతో అల్లూరి కాంస్య విగ్రహం తయారీతోపాటు మినీ పార్కు ఏర్పాటు చేశారు. శుక్రవారం జరగనున్న విగ్రహావిష్కరణ నేపథ్యంలో స్పీకర్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. పర్యవేక్షకుడు గణపతిరాజు సూర్యబంగార్రాజుకు పలు సూచనలు చేశారు. క్షత్రియ పరిషత్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ సూర్యనా రాయణరాజు, ఆర్డీవో వి.వి.రమణ, డీఎస్పీ పి.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర పాల్గొన్నారు.