
మత్స్యకారుడి ఆచూకీ కనుగొనడంలో నిర్లక్ష్యం
నేవీ దళంతో గాలించాలని డిమాండ్
అచ్యుతాపురం రూరల్: గల్లంతైన పూడిమడక గ్రామానికి చెందిన మత్స్యకారుడు చోడిపల్లి యర్రయ్య ఆచూకీ కనుగొనే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మత్స్యకార సంఘాల నాయకులు ఆగ్రహిస్తున్నారు. మత్స్యకారుని గల్లంతు విషయమై అధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. కుటుంబానికి జీవనాధారంగా ఉండే కొడుకు కనిపించకపోవడంతో తల్లి ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. అధికారులు చొరవ తీసుకుని నావికాదళ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టాలని మత్స్యకార నాయకులు, కుటుంబీకులు కోరుతున్నారు.