
సమర్థంగా రహదారి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ
● ఎస్పీ తుహిన్ సిన్హా ● కొత్తగా 16 ఆధునిక వాహనాలు ప్రారంభం
అనకాపల్లి: రహదారి భద్రత, ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆధునిక మోటారు సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు 16 కొత్త ద్విచక్ర వాహనాలను స్థానిక మెయిన్ రోడ్డులోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్, 15 టీవీఎస్ అపాచీ ద్విచక్ర వాహనాలను రహదారి భద్రత, ట్రాఫిక్ నియంత్ర ణ కోసం కేటాయించామన్నారు. ఈ వాహనాలను సైరన్, బ్లింకర్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్ట మ్, క్రౌడ్ కంట్రోల్ టె క్నాలజీతో ప్రత్యేకంగా రూపొందించామన్నా రు. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాలు, రోడ్డు ప్రమాదాలు జరిగే స మయాల్లో ట్రాఫిక్ పో లీసులు వీటి సహాయంతో తక్షణమే చేరుకునే అవకాశం కలుగుతుందన్నారు. నాలుగు చక్రా ల వాహనాలు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా పోలీసులు సత్వరం చేరుకునేలా ఈ మోటా రు సైకిళ్లు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నా రు. ఏఎస్పీ ఎల్.మోహనరావు, డీఎస్పీలు శ్రావణి, డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ పి.నాగేశ్వరరావు, పట్టణ ట్రాఫిక్ సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.