
బీఎన్ రోడ్డులో చేపల వేటతో నిరసన
బీఎన్ రోడ్డులో వలతో చేపలు పడుతూ నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు, ప్రజలు
రోలుగుంట: స్థానిక నర్సీపట్నం – భీమిలి ఆర్‌అండ్‌బీ రోడ్డు దుస్థితిపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీపీఎం నాయకులు కె.గోవింద, ఇ.చిరంజీవిల ఆధ్వర్యంలో సోమవా రం స్థానిక మండల కార్యాలయ సముదాయం కూడలి సమీపంలో చెరువును తలపిస్తున్న రోడ్డు గుంతలో వలతో చేపల పడుతూ తమ నిరసన తెలిపారు. సీపీఎం నాయకుడు మాట్లాడుతూ ఈ గోతుల రోడ్డులో రాకపోకలు చేసే వాహనదారులు అదుపు తప్పి బోల్తాపడి గాయాల పాలవుతున్నారన్నారు. కొవ్వూరు, కె.నాయుడుపాలెం, పాపంపేట, అంట్లపాలెం తదితర గ్రామాల నుంచి గర్భిణులను గాని, క్షతగాత్రులను గాని 108 వాహనంలో తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ రోడ్డు మెరుగుపరచి రవాణా కష్టాలు తీరుస్తామని బూట కపు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి ఏడాదైనా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వాన్ని దూషించిన ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు ఇప్పుడు ఏం చేస్తున్నారు.. నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.