
ప్రజలకు సేవలందించడంలో రెవెన్యూశాఖ కీలకం
అనకాపల్లి టౌన్: ప్రజలతో నిత్యం మమేకమై రెవెన్యూ సేవలందించే వీఆర్వోలకు ఐక్య వేదిక ఒకటి ఉండడం ఎంతో అవసరమని కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కన వీఆర్వోల సంఘం నూతన బిల్టింగ్ నిర్మాణానికి శంకుస్థాపన పనులు ఆదివా రం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నూతన భవన నిర్మాణానికి లక్ష రూపాయలు సొంత నిధుల ను ఇస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా చేయడంలో రెవెన్యూ శాఖ పాత్ర అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఈర్లె శ్రీరామమూర్తి, ఏపీ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బి. వెంకటేశ్వరావును శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.అయేషా, సంఘం నాయకులు ఎస్.టి.రామదాసు, ఎ.శశి, సిహెచ్ ఇరుకునాయుడు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయకృష్ణన్
వీఆర్వోల సంఘ భవనానికి శంకుస్థాపన