
పరిహారాన్ని నగదు రూపంలో ఇవ్వాలి
అచ్యుతాపురం: అచ్యుతాపురం–అనకాపల్లి రోడ్డు విస్తరణ బాధితులకు నగదు రూపంలో పరిహారాన్ని ఇవ్వాలని, టీడీఆర్‌ల రూపంలో వద్దని రోడ్డు విస్తరణ నిర్వాసితుల సంఘం క న్వీనర్ ఆర్.రాము డిమాండ్ చేశారు. ఆదివా రం మండల కేంద్రం అచ్యుతాపురంలో వారు నిర్వాసితుల తరఫున నిరసన వ్యక్తం చేసి, నినాదాలు చేశారు. రోడ్డు విస్తరణలో కోల్పోతున్న భూములు, ఇళ్లు, దుకాణాలకు తక్కువ మార్కెట్ ధర చూపిస్తున్నారని, ఇది అన్యాయమన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్ర మంలో బ్రహ్మాజీ, కర్రి అప్పారావు, రామ సదాశివరావు, ఎస్.కనుమనాయుడు, బుద్ధ రంగారావు పాల్గొన్నారు.