
కూటమి ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులకు రక్షణ కరవు
● కేజీబీవీ ప్రిన్సిపాల్‌పై దురుసుగా ప్రవర్తించిన చోడవరం ఎమ్మెల్యే, కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్
అనకాపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళా ఉద్యోగులకు రక్షణ కరవైందని, కూటమి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపాల్ అన్నపూర్ణను చోడవరం ఎమ్మెల్యే, కూటమి నేతలు దూషించి, ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సుమారు నాలుగున్నర గంటల పాటు నిలుచోబెట్టడం అన్యాయమన్నారు. అనకాపల్లి పట్టణంలో శారదాకాలనీలో అన్నపూర్ణ స్వగృహానికి అమర్‌నాథ్, పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ కరణం ధర్మశ్రీ, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ ఆదివారం వెళ్లి, పరామర్శించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ కేజీబీవీ ప్రిన్సిపాల్‌కు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. అన్నపూర్ణ కశింకోట మండలం తేగాడగ్రామం కేజీబీవీలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన సమయంలో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించారని, ఆమెను అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సత్కరించిందన్నారు. 2022లో సాధారణ బదిలీల్లో వడ్డాది కేజీబీవీకి ఆమె వెళ్లారని, చోడవరం నియోజకవర్గంలో కూటమి నాయకుల్లో అంతర్గత కుమ్ములాటల కారణంగా ప్రిన్సిపాల్‌ను వేధించడం అన్యాయమన్నారు. ప్రిన్సిపాల్‌ను వేధించిన ఎమ్మెల్యే, కూటమి నాయకులపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ యోగాంధ్ర సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే... బుచ్చెయ్యపేట ఎంపీడీవోను మానసికంగా వేధించడంతో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారన్నారు. వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపాల్ అన్నపూర్ణను కూటమి నేతలు వేధించడం అన్యాయమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. చోడవరంలో కూటమి నేతలు కుమ్ములాట వల్ల వేరు కుంపట్లుగా ఏర్పడ్డారని, ఆధిపత్యంకోసం అక్కడ ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ మాట్లాడుతూ ప్రిన్సిపాల్‌ను చోడవరం ఎమ్మెల్యే కార్యాలయానికి పిలిపించుకుని, మానసికంగా వేధించడం అన్యాయమన్నారు. ఏడాది పాలనలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులపై కూటమి నేతలు అరాచకాలు పెరిగిపోయాయన్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తే, కూటమి నేతలు ఆమైపె దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు. 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత మాట్లాడుతూ చోడవరం ఎమ్మెల్యే... మహిళా ప్రిన్సిపాల్‌ను దూషించడం తగదన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తే, కూటమి పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్‌రాజా, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు వేగి త్రినాఽథ్, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు గైపూర్ రాజు, 80వ వార్డు ఇన్‌చార్జ్ కె.ఎం.నాయుడు, పార్టీ నేతలు బొడ్డేడ శివ, దొడ్డి హరిబాబు, మునూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.