
మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు అదనంగా భూములివ్వం
నక్కపల్లి: ఆర్సిలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ కోసం ఏపీఐఐసీ చేస్తున్న అదనపు భూసేకరణతో రైతులకు తీరని నష్టం కలుగుతుందని, వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఇతర వృత్తుల వారు జీవనోపాధి కోల్పోతారని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నెల్లిపూడిలో రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు నాయకులు గింజాల రమణ, అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ ఇప్పటికే నక్కపల్లి మండలంలో రైతుల నుంచి ఐదు వేల ఎకరాలకు పైగా భూములు సేకరించి బల్క్ డ్రగ్‌పార్క్, స్టీల్‌ప్లాంట్‌లకు కేటాయించారని, స్టీల్‌ప్లాంట్ టౌన్ షిప్ కోసం నెల్లిపూడి, వేంపాడు, డీఎల్ పురం, కాగిత గ్రామాల్లో మరో 3,265 ఎకరాలు సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సేకరించే భూముల్లో మామిడి, జీడి, కొబ్బరి పంటలు పండే భూములు ఉన్నాయని, ఈ భూముల్లో ఉన్న తోటల వల్ల రైతులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఉద్యాన వన పంటలు ఎక్కువగా పండే భూములను లాక్కోడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మత్స్యకారులు ఎనిమిది గ్రామాల్లో నివసిస్తున్నారని ప్రమాదకర రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేసి, వారి జీవనోపాధి దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో జాతీయ రహదారికి తీరప్రాంతానికి మధ్యలో ఉన్న భూములన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోను మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం అదనంగా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. అదేవిధంగా క్యాప్టివ్ పోర్టును మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించడాన్ని కూడా వారు తప్పుపట్టారు. పోర్టు నిర్మిస్తే మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారన్నారు. క్యాప్టివ్‌పోర్టు స్టీల్‌ప్లాంట్ ఆధీనంలో ఉంటే మత్స్యకారులు వేటలేక మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెప్పారు. అదనపు భూసేకరణను అడ్డుకుని తీరుతామన్నారు.రైతుల ఆమోదం లేకుండా అదనంగా సేకరించే భూముల కోసం సర్వే చేస్తున్నారని, ఈ సర్వేని అడ్డుకుని తీరుతామని తెలిపారు. ఈ సమావేశంలో రైతులు అవతారం రాజు,తాతరాజు, సూరిబాబు,చినతాతలు తదితరులు పాల్గొన్నారు. డీఎల్ పురంలో కూడా రైతులు నిరసన తెలిపారు.
క్యాప్టివ్‌పోర్టుతోమత్స్యకారుల మనుగడ ప్రశ్నార్థకం
అఖిల పక్ష సమావేశంలోరైతులు స్పష్టీకరణ

మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు అదనంగా భూములివ్వం