
డిష్యుం..డిష్యుం..
● జేవీపాలెంలో జనసేన గ్రామాధ్యక్షుడిపై టీడీపీ సూపర్ సర్పంచ్ దాడి ● ఇంటింటి కుళాయి పనుల వద్ద వివాదం ● మహిళలపై దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేత ● గణపర్తి పాల సంఘ అధ్యక్ష ఎన్నికలో టీడీపీ–బీజేపీ వైరం
కూటమి నేతల
గణపర్తిలో టీడీపీ–బీజేపీ మధ్య తారస్థాయిలో విభేదాలు
మునగపాక: కూటమి కూర్పు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. పై స్థాయిలో కూటమి పెద్దలంతా ఒక్కటిగా కలిసి ఉన్నామంటూ చెప్పుకుంటున్నా కింద స్థాయిలో మాత్రం మూడు పార్టీల మధ్య రోజురోజుకు అగాధం పెరుగుతూనే వస్తోంది. తాజాగా మండలంలోని గణపర్తి పాల సంఘం అధ్యక్ష ఎన్నికకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బుధవారం రాత్రి టీడీపీ–బీజేపీ శ్రేణులు డిష్యూం, డిష్యూంకు దిగాయి. దీనిలో భాగంగా పాల సంఘం అధ్యక్షునిగా టీడీపీ నుంచి మాజీ సర్పంచ్ రామ నాగేశ్వరరావు, బీజేపీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు త్రినాథ్ నిలబడేందుకు ముందుకొచ్చారు. పది సంవత్సరాలుగా అధ్యక్షునిగా త్రినాథ్ కొనసాగడంతో ఈసారి అతను తప్పుకోవాలంటూ టీడీపీ నేత రామనాగేశ్వరరావు వర్గీయులు కోరారు. ఇందుకు త్రినాథ్ వర్గీయులు తమకు విశాఖ డెయిరీ పెద్దల సహకారం ఉందని, ఈ విషయమై ససేమిరా అనడంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారి తీసింది. ఒక వర్గంపై మరో వర్గం దాడి చేసుకునే స్థాయికి వివాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు చర్చలు జరిగినా ఫలితం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ఈ వివాదానికి సంబంధించి ఒక వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసుకునే స్థాయికి వెళ్లడంతో కూటమిలో కుమ్ములాట చిలికి చిలికి గాలివానగా మారే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద కూటమిలో కుంపటి రాజేసుకుందనడంలో సందేహం లేదు.
ఏడాది పాలనలోనే కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పై స్థాయిలో కూటమి పెద్దలంతా ఒక్కటేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. కింద స్థాయిలో మాత్రం వివాదాలు రాజుకుంటున్నాయి. పరస్పర దాడులకు సైతం దిగేందుకు వెనుకాడటం లేదు. తాజాగా ఎస్.రాయవరం మండలం జేవీపాలెంలో ఇంటింటి కుళాయి విషయమై జనసేన గ్రామాధ్యక్షుడిపైనా మహిళలపైనా టీడీపీ సూపర్ సర్పంచ్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. మునగపాక మండలం గణపర్తి పాల సంఘం అధ్యక్ష ఎన్నికలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య వైరం తారస్థాయికి చేరి కొట్లాటకు దిగారు.

డిష్యుం..డిష్యుం..