గతానికంటే మెరుగైన సీట్లతో మళ్లీ జగనన్న పాలన | Sakshi
Sakshi News home page

గతానికంటే మెరుగైన సీట్లతో మళ్లీ జగనన్న పాలన

Published Tue, May 21 2024 10:20 AM

గతానికంటే మెరుగైన సీట్లతో మళ్లీ జగనన్న పాలన

● చోడవరంలో భారీ మెజార్టీతోఘన విజయం సాధిస్తాం ● మండలాల వారీ సమీక్షలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

చోడవరం: ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో గతం కన్నా మెరుగైన సీట్లతో మళ్లీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని, చోడవరంలో భారీ మోజార్టీతో గెలిచేది తానేనని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని రోలుగుంట, రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం మండలాల పార్టీ శ్రేణులతో విడివిడిగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాలు, గ్రామ పంచాయతీలోని పోలింగ్‌ కేంద్రాల వారీగా నమోదైన ఓట్లు, వైఎస్సార్‌సీపీకి వచ్చే ఓట్ల వివరాలు, మెజార్టీ గురించి కార్యకర్తలతో కూలంకషంగా సమీక్షించారు. అన్ని చోట్లా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, దీంతో గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ప్రతి మండలంలో మెజార్టీ కనిపిస్తున్న తరుణంలో పార్టీ శ్రేణుల్లో జోష్‌ కనిపిస్తోందన్నారు. అయితే కొన్ని దృష్ట శక్తులు పార్టీలోనే ఉంటూ పార్టీకి దెబ్బతీసేలా వ్యవహరించారని, అలాంటి వారికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పక తప్పదన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని, వారందరికీ న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ ఆధిష్టానం కూడా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చోడవరంలో పార్టీ జెండా ఎగురవేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇదే ప్రోత్సాహం భవిష్యత్తులో కూడా ఉండాలని పార్టీ శ్రేణులుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆశించిన రీతిలో వలంటీర్లు సహకరించలేదన్న విమర్శలు సమావేశంలో వ్యక్తం అయ్యాయి. సమావేశంలో నాలుగు మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement