అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Published Tue, May 21 2024 10:20 AM

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మాకవరపాలెం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణారావు సోమవారం మీడియాకు తెలిపారు. వివరాలు. మండలంలోని సుభద్రయ్యపాలెం గ్రామానికి చెందిన అత్తుమూరి గంగరాజు(53) తాళ్లపాలెం వద్దనున్న ఓ సిమెంట్‌ ఫ్యాక్టరీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 16 నుంచి ఆయన అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం పీపీ అగ్రహారం సమీపంలోని సరుగుడు తోటలో గంగరాజు మృతదేహం లభ్యమైంది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement