నేడు మోదకొండమ్మ కొలువు సంబరం | Sakshi
Sakshi News home page

నేడు మోదకొండమ్మ కొలువు సంబరం

Published Tue, May 21 2024 10:15 AM

-

మాడుగుల: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ నెల రోజుల పండగ సందర్భంగా మంగళవారం కొలువు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అమ్మవారి ఘటాలను శుభ్రపరచి సిద్ధం చేశారు. అమ్మవారికి వడ కులస్తులు తొలిపూజలు నిర్వహించే సంప్రదాయం పూర్వం నుంచి కొనసాగుతోందని కమిటీ సభ్యులు చెప్పారు. మంగళవారం ఉదయం ఆలయం నుంచి అమ్మవారి ప్రతిరూపమైన ఘటాలను ఆలయ కమిటీ సభ్యులతోపాటు భక్తులు శిరస్సున పెట్టుకుని, మంగళవాయిద్యాలు, డప్పులు, కోలాటాల నడుమ మహరాజుల కోట బయట ఉన్న సతకం పట్టు వద్దకు తీసుకొస్తారు. అక్కడ అమ్మవారి కొలువు ఏర్పాటు చేస్తారు. నెలరోజులపాటు అమ్మవారు భక్తులకు అక్కడే దర్శనమిస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement