కరక రంగురాళ్ల క్వారీలో తవ్వకాలకు పాల్పడిన ఇద్దరి అరెస్టు

రంగురాళ్ల తవ్వకందారులతో అటవీ సిబ్బంది  - Sakshi

నర్సీపట్నం: గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీ ప్రాంతంలో తవ్వకాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్టు డీఎఫ్‌వో లక్ష్మణ్‌ తెలిపారు. కరక రంగురాళ్ల క్వారీ ప్రాంతంలో మట్టిని తవ్వుకుని తీసుకువస్తుండగా అటవీశాఖ సిబ్బంది ఇద్దరు వ్యక్తులను పట్టుకుని, వారి వద్ద ఉన్న మూడు మట్టి మూటలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. గొలుగొండ మండలం కొత్తయల్లవరం స్వీపర్‌ జల్లు నూకరాజు(58), బుచ్చెయ్యపేట మండలం, తోటకూరపాలెంకు చెందిన కాపారపు ప్రసాద్‌(28)లు ఆదివారం క్వారీ పరిసరాల్లో మట్టిని తవ్వుకుని తీసుకువస్తుండగా తమ సిబ్బంది అరెస్టు చేశారని డీఎఫ్‌వో తెలిపారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top