అవరోధాలు ఎదురైనా ఆత్మస్థైర్యం వీడొద్దు

దివ్యాంగులకు ల్యాబ్‌టాప్‌లు అందజేస్తున్న ట్రైనీ కలెక్టర్‌ సర్మణ్‌రాజ్‌ - Sakshi

అనకాపల్లిటౌన్‌: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ట్రైనీ కలెక్టర్‌ బి.స్మరణ్‌రాజ్‌ అన్నారు. గవరపాలెం గౌరీసేవాసంఘం మళ్ల జగన్నాథరావు కల్యాణమండపంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ విభిన్నప్రతిభావంతుల దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ అధైర్యపకూడదన్నారు. జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు గ్రూప్‌లుగా ఏర్పడి రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు ఎన్నో సంక్షేమకార్యక్రమాలు అమలు చేస్తున్నాయని, వాటిని పొందేందుకు అందరికీ అవగాహన కల్పించి, సహాయం చేస్తున్న పి.ఎస్‌.తిరుపతి పట్నాయక్‌ కృషి అభినందనీయమన్నారు. ఆర్‌పీడీ చట్టం సభ్యుడు పి.ఎస్‌.తిరుపతి పట్నాయక్‌ మాట్లాడుతూ ఆగిపోయిన ప్రభుత్వ పింఛన్లు పునరుద్ధరించాలని కోరారు. అనంతరం యువతీయువకులకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వినికిడి యంత్రాలను ట్రైనీ కలెక్టర్‌ స్మరణ్‌రాజ్‌ అందజేశారు. అంతకుముందు బాలికలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా సహాయ సంచాలకుడు బి.వి.జగదీష్‌, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల విభిన్నప్రతిభావంతుల ఇన్‌ఛార్జి ఇమ్మందుల వెంకటరమణ, విభిన్నప్రతిభావంతులు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరుయాదవ్‌, నాయకులు వేదుల చంద్రశేఖర్‌, దుగ్గిరాల రవికుమార్‌ పాల్గొన్నారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top