మిలట్రీ కాలనీలో చోరీకి యత్నం

చోరీకి యత్నించిన ఇంటిలో అద్దెకుంటున్న వారితో మాట్లాడుతున్న పట్టణ ఎస్‌ఐ 
పాపినాయుడు  - Sakshi

యలమంచిలి(అనకాపల్లి రూరల్‌): పట్టణంలోని మిలట్రీ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగ చోరీకి యత్నించాడు. ఆ ఇంట్లో నివాసముంటున్న రౌతు శ్రీరాం కుటుంబం విజయనగరం జిల్లా రామభద్రపురంలో బంధువుల వివాహానికి వారం రోజుల క్రితం వెళ్లారు.ఈ విషయాన్ని గమనించిన దొంగ ఆదివారం రాత్రి ఇంటి పక్కనున్న పశువుల పాకలో గునపాం తెచ్చి ఇంటి తలుపు,కిటికీ పగులగొట్టాడు. ఇంట్లోకి ప్రవేశించి ఎంత వెతికినా బంగారం, డబ్బు, ఇతర విలువైన వస్తువులేవీ దొరక్కపోవడంతో అక్కడ్నుంచి పరారయ్యడు. చోరీకి యత్నించిన వ్యక్తి అంతకుముందు కాలనీలో పలు ఇళ్లలో కూడా దొంగతనానికి వెతకడం ఓ ఇంటి ముందున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సుమారు 35 సంవత్సరాల వయసున్న వ్యక్తి,చొక్కా లేకుండా దొంగతనాలకు యత్నించడాన్ని గుర్తించామని పట్టణ ఎస్‌ఐ పాపినాయుడు తెలిపారు. సీసీ కెమెరాల పుటేజి ఆధారంగా ఈ చోరీకి యత్నించిన వ్యక్తి పాత నేరస్తుడా? మరొకరా అన్నది గుర్తిస్తున్నామని, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని చెప్పారు. పట్టణంలో రాత్రి వేళల్లో ఎవరైనా అపరిచిత, అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్టు తెలిస్తే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. కాగా చోరీ జరిగిన ఇంట్లో నివాసముంటున్న రౌతు శ్రీరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top