రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

Published Mon, Dec 4 2023 12:56 AM

జిల్లాస్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో క్రీడాకారులు  - Sakshi

మునగపాక: రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఆదివారం ఎంపిక చేశారు. మండలంలోని తిమ్మరాజుపేట డావెన్సీ పాఠశాలలో ఎంపిక పోటీలు నిర్వహించారు. అనంతరం జిల్లా జట్టును అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కర్రి సుందరయ్య, సీహెచ్‌ దేముడులు ప్రకటించారు. ఫ్రీ స్టైల్‌, బ్యాక్‌ స్ట్రోక్‌, బటర్‌ఫ్లై, బ్రెస్ట్‌ స్ట్రోక్‌, ఐఎం ఈవెంట్లలో విజయం సాధించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. కేటగిరీ–1లో పి.నిహాల్‌, బి.రామతేజ, బి.శ్రీ తేజ, సుమిత, రాణి, కేటగిరి–2లో శ్రీ ధనుష్‌, జయదీప్‌, తేజ, నిఖిలేష్‌, నిఖిల్‌, సాయి రణధీర్‌, ధార్మిక, సివంత, కేటగిరి–3లో పద్మాకర్‌, హర్షిత్‌, గౌతమ్‌, నంద, రవీంద్రకుమార్‌, చేతన్‌, కార్తీక్‌, వరసిద్ధి, లహరి, లాస్య తదితరులు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. వారిని సుందరయ్య, దేముడులు అభినందించారు. నర్సారావుపేటలో ఈ నెల 16, 17 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి.

 
Advertisement
 
Advertisement