సేవా భావంలో మేటి వలంటీర్లు | Sakshi
Sakshi News home page

సేవా భావంలో మేటి వలంటీర్లు

Published Mon, Dec 4 2023 12:56 AM

కోటవురట్ల: విశాఖలోని గీతం ఆస్పత్రిలో బాబూరావుకు నగదు అందిస్తున్న వలంటీర్లు - Sakshi

సొంత ఖర్చులతో విశాఖ వెళ్లి పింఛన్ల అందజేత

వలంటీర్లు వృత్తి ధర్మంలో సేవా భావాన్ని చూపిస్తూ పింఛనుదారులకు అండగా నిలుస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాన్ని నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను చేరవేస్తున్నారు. తాజాగా కోటవురట్ల, మునగపాక, చీడికాడ, కె.కోటపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో అందుబాటులో లేని పింఛనుదారుల ఆర్థిక పరిస్థితి తెలుసుకుని సొంత ఖర్చులతో విశాఖలోని వివిధ ఆస్పత్రులకు వెళ్లి వారికి పింఛన్లు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

మునగపాక: మండలంలోని తిమ్మరాజుపేటకు చెందిన సారిశ రామకృష్ణ అనారోగ్యంతో పెందుర్తిలో తన కుమార్తె వద్ద ఉంటున్నాడు. ఆదివారం వలంటీర్‌ నరేంద్రబాబు అక్కడకు వెళ్లి ఈ నెల పింఛన్‌ రూ.2750 అందజేశాడు. మెలిపాకకు చెందిన నిదాని విమలావతి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాదపడుతూ కూర్మన్నపాలెంలో బంధువుల ఇంటి వద్ద ఉంటోంది. అక్కడకు వలంటీర్‌ గుబ్బల నూకరత్నం వెళ్లి పింఛన్‌ అందజేసింది. విశాఖ కేజీహెచ్‌లో పదిహేను రోజులుగా చికిత్స పొందుతున్న గణపర్తి గ్రామానికి చెందిన దాడి లక్ష్మికి అదే గ్రామానికి చెందిన వలంటీర్‌ వెలగా జగది పింఛన్‌ను అందజేసి అందరి మన్ననలు అందుకుంది.

కోటవురట్ల: మండలంలోని కె.వెంకటాపురానికి చెందిన గొల్లు బాబూరావు అనారోగ్యంతో విశాఖలోని గీతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వలంటీర్లు ఉండా రమణమ్మ, గొల్లు రామలక్ష్మి అక్కడకు వెళ్లి పింఛను సొమ్ము అందజేశారు.

చీడికాడ: మండలంలోని చెట్టుపల్లికి చెందిన డప్పు కళాకారుడు ములుపర్తి అప్పారావు అనారోగ్యంతో విశాఖలోని విమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. వలంటీరు పాతాళం ప్రసాద్‌ తన సొంత ఖర్చులతో అక్కడకు వెళ్లి పింఛన్‌ అందించాడు. అప్పారావు భార్య చాలా ఆనందం వ్యక్తం చేసింది.

కె.కోటపాడు: మండలంలోని కింతాడ గ్రామానికి చెందిన పల్లా దుర్గాలమ్మ విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. వలంటీర్‌ జోగ దేముళ్లు తన సొంత ప్రయాణ ఖర్చులతో అక్కడకు వెళ్లి పింఛన్‌ అందించాడు.

మునగపాక: విశాఖ కేజీహెచ్‌లో లక్ష్మికి పింఛన్‌ అందజేస్తున్న వలంటీర్‌ జగది
1/5

మునగపాక: విశాఖ కేజీహెచ్‌లో లక్ష్మికి పింఛన్‌ అందజేస్తున్న వలంటీర్‌ జగది

మునగపాక: పెందుర్తిలో 
రామకృష్ణకు పింఛన్‌ 
అందజేస్తున్న  వలంటీర్‌
2/5

మునగపాక: పెందుర్తిలో రామకృష్ణకు పింఛన్‌ అందజేస్తున్న వలంటీర్‌

మునగపాక: కూర్మన్నపాలెంలో విమలావతికి పింఛన్‌ 
అందజేస్తున్న వలంటీర్‌
3/5

మునగపాక: కూర్మన్నపాలెంలో విమలావతికి పింఛన్‌ అందజేస్తున్న వలంటీర్‌

కె.కోటపాడు: కేజీహెచ్‌లో పింఛన్‌ అందిస్తున్న 
వలంటీర్‌ దేముళ్లు
4/5

కె.కోటపాడు: కేజీహెచ్‌లో పింఛన్‌ అందిస్తున్న వలంటీర్‌ దేముళ్లు

చీడికాడ: విమ్స్‌లో 
పింఛన్‌ అందిస్తున్న వలంటీర్‌ ప్రసాద్‌
5/5

చీడికాడ: విమ్స్‌లో పింఛన్‌ అందిస్తున్న వలంటీర్‌ ప్రసాద్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement