దిబ్బిడిలో అదుపులోకి వచ్చిన డయేరియా | Sakshi
Sakshi News home page

దిబ్బిడిలో అదుపులోకి వచ్చిన డయేరియా

Published Sun, Nov 12 2023 1:32 AM

దిబ్బిడిలో బాధితుల ఇళ్లకు వెళ్లి మాట్లాడుతున్న డాక్టర్‌ కృష్ణ  - Sakshi

బుచ్చెయ్యపేట: మండలంలోని దిబ్బిడిలో అతిసార (డయేరియా) అదుపులోకి వచ్చింది. మూడో రోజు శనివారం బుచ్చెయ్యపేట పీహెచ్‌సీ వైద్యాధికారి కేవీ కృష్ణ, తమ సిబ్బందితో వైద్య శిబిరం ఏర్పాటు చేయడమేగాక బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య స్థితిగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నిర్మించిన మంచినీటి ట్యాంకు నీళ్లు బాగానే ఉన్నట్లు రిపోర్టు వచ్చిందని గ్రామస్తులంతా నిర్భయంగా తాగొచ్చని వైద్యుడు సూచించారు. బుధవారం సంతలో కొనుగోలు చేసిన మాంసాహారాలు వల్ల గాని గ్రామంలో ఇటీవల పలు ఫంక్షన్‌లో తిన్న కలుషిత ఆహారం వల్ల గాని అతిసార వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. గ్రామంలో జెడ్పీటీసీ దొండా రాంబాబు పర్యటించి బాధితులను పరామర్శించారు. ఎంపీడీవో సువర్ణరాజు శానిటేషన్‌ చేయించారు.

Advertisement
 
Advertisement