గిరిజనుల స్థితిగతులపై ట్రైనీ ఐఏఎస్‌ల అధ్యయనం | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల స్థితిగతులపై ట్రైనీ ఐఏఎస్‌ల అధ్యయనం

Published Wed, Aug 30 2023 1:48 AM | Last Updated on Wed, Aug 30 2023 1:48 AM

గిరిజనులతో ఫోటో దిగిన ట్రైనీ ఐఏఎస్‌ల బృందం  - Sakshi

సీలేరు: ట్రైనీ ఐఏఎస్‌ల బృందం జిల్లాలో మారుమూల దుప్పులవాడ పంచాయతీలోని గ్రామాల్లో మంగళవారం పర్యటించింది. అక్కడి గిరిజనుల స్థితిగతులు, జీవన శైలి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎలా చేరుతున్నాయి అన్న విషయాలను అధ్యయనం చేసేందుకు ఏడుగురు సభ్యుల బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. మొదటి రోజు నడిమిగుడ, బందవీధి, రాంపు, రేవళ్లమడుగు, రష్యాగుడ గ్రామాలకు వెళ్లిన ట్రైనీ ఐఏఎస్‌లు గ్రామస్తులతో మమేకమయ్యారు. వారి నుంచి పంటల సాగు వివరాలు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న వైద్యం, తాగునీరు, రహదారి సౌకర్యం, ఇళ్ల నిర్మాణం, గంజాయి సాగు, దాని వల్ల వచ్చే అనర్థాలు, ప్రత్యామ్నాయ పంటలు సాగు తదితర వివరాలు సేకరించారు. వారి వెంట మండల విస్తరణాధికారి పాపారావు, సెక్రటరీ వెంకటరావు, సర్పంచ్‌ కేలేపు కుమారి, మండల సీడీపీవో లక్ష్మి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
గిరిజనుల నుంచి వివరాలు సేకరిస్తున్న ట్రైనీ ఐఏఎస్‌
1/1

గిరిజనుల నుంచి వివరాలు సేకరిస్తున్న ట్రైనీ ఐఏఎస్‌

Advertisement
 
Advertisement
 
Advertisement