సమాన హక్కులు కల్పించిన మహనీయుడు
● పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు
● అంబేడ్కర్‌కు ఘన నివాళి
అరకు, పాడేరులో అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మత్య్సరాస విశ్వేశ్వరరాజు, పార్టీ శ్రేణులు
పాడేరు: అణగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు లేని సమాజం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. ఆయన వర్ధంతిని శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుతో పాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడిచి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, కొయ్యూరు, గూడెంకొత్తవీధి మండల పార్టీ అధ్యక్షుడు బిడిజన అప్పారావు, పాంగి గుణబాబు, పార్టీ నాయకులు రామ్మూర్తి, పెట్ల గాంధీ పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. శనివారం తన క్యాంప్ కార్యలయంలో ఆయన వర్థంతి నిర్వహించారు. అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజికంగా, రాజకీయంగా నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నడుచుకోవాలన్నారు. జెడ్పీటీసీ శెట్టి రోషిణి, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి శెట్టి అప్పాలు, యువజన నాయకుడు రేగం చాణిక్య, అరకులోయ, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, ఎంపీటీసీ దురియా ఆనంద్‌కుమార్, సర్పంచ్‌లు పెట్టెలి సుశ్మిత, కొర్రా రాధిక, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు పాడి రమేష్, కిముడు హరి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పల్టాసింగి విజయ్ కుమార్, మండల పార్టీ కార్యదర్శులు సొనియ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
చింతపల్లి: స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతి నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సందీప్‌నాయక్, జోగారావు, టీచింగ్ అసోసియేట్ బాపూజీ, విద్యార్థులు పాల్గొన్నారు.
సమాన హక్కులు కల్పించిన మహనీయుడు
సమాన హక్కులు కల్పించిన మహనీయుడు


