వణికిస్తున్న శీతల గాలులు
● దట్టంగా కురుస్తున్న మంచు
● అరకువ్యాలీలో 8.1, డుంబ్రిగుడలో
8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
లోతుగెడ్డ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై కురుస్తున్న మంచు
లంబసింగిలో
మంటలు కాగుతున్న గిరిజనులు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన వారం రోజులుగా మంచు దట్టంగా కురుస్తోంది. శీతలగాలుల వల్ల చలి తీవ్రత నెలకొంది. శనివారం అరకువ్యాలీలో 8.1 డిగ్రీలు, డుంబ్రిగుడలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 99.9 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 10.1 డిగ్రీలు, హుకుంపేటలో 10.8 డిగ్రీలు, పెదబయలులో 11.4 డిగ్రీలు, పాడేరులో 12.9 డిగ్రీలు, చింతపల్లిలో 14.5 డిగ్రీలు ,కొయ్యూరులో 14.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఏడీఆర్ పేర్కొన్నారు.
● రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 13.1 డిగ్రీలు, మారేడుమిల్లిలో 14.9 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 115.6 డిగ్రీలు, అడ్డతీగలలో 17.0 డిగ్రీలు, రంపచోడవరంలో 17.7 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 16.9 డిగ్రీలు, ఎటపాకలో 17.9 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ తెలిపారు.
● సాయంత్రం నుంచి ఉదయం 9 గంటల వరకు చలితీవ్రత ఉంటోంది. దీంతో మన్యంవాసులు మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. మంచు తెరలు ఉదయం 9 గంటల వరకు వీడకపోవడంతో హెడ్‌లైట్ల వెలుగులో వాహన రాకపోకలు సాగిస్తున్నారు.
రాజవొమ్మంగి: తూర్పు ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి పరిసరాల్లో శనివారం చలి తీవ్రత పెరగడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం నుంచి చలితీవ్రత ఎక్కువగా ఉన్నందున మంటలను ఆశ్రయిస్తున్నారు.


