80 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్టు
● ప్రసవం చేసిన 108 సిబ్బంది
● అనంతరం తల్లీబిడ్డను రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తరలింపు
పట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసులు
జి.మాడుగుల: మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 80 కిలోల గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ షణ్ముఖరావు శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఈదులబయలు జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో 80 కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. మైదాన ప్రాంతానికి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి గంజాయి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. వీరిలో పెందుర్తికి చెందిన ఇద్దరు, జి.మాడుగులకు చెందిన మరో ఇద్దరు ఉన్నారన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.4 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నలుగురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.
గర్భిణికి ఇంటివద్దే పురుడు
కొయ్యూరు: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి 108 సిబ్బంది ఇంటివద్దనే పురుడు పోశారు. మండలంలోని ఎం.మాకవరం పంచాయతీ పిట్టాచలంకు చెందిన పాడి వెంకటలక్ష్మికి శనివారం ఉదయం పురిటినొప్పులు మొదలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించడంతో సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ఈఎంటీ ఈశ్వరరావు, పైలట్ హరిప్రసాద్, ఆశా వర్కర్ ఆమెకు పురుడు పోశారు. అనంతరం తల్లీబిడ్డను 108 వాహనంలో రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తరలించారు.
80 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్టు


