రంపచోడవరంలో ఆధార్‌ సెంటర్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

రంపచోడవరంలో ఆధార్‌ సెంటర్‌ ఏర్పాటు

Dec 7 2025 8:33 AM | Updated on Dec 7 2025 8:33 AM

రంపచోడవరంలో ఆధార్‌ సెంటర్‌ ఏర్పాటు

రంపచోడవరంలో ఆధార్‌ సెంటర్‌ ఏర్పాటు

రంపచోడవరం: ఏజెన్సీలో ఆధార్‌ నమోదుకు ఇబ్బందులు లేకుండా కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్‌ అన్నారు. స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో శనివారం ఆధార్‌ నమోదు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఐటీ సొల్యూషన్‌ ద్వారా ఈ ఆధార్‌ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఏజెన్సీలో 72 ఆధార్‌ కిట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్‌ అప్‌డేట్‌, బయోమెట్రిక్‌, కొత్త ఆధార్‌ కార్డులు ఈ సెంటర్‌లో చేస్తారని తెలిపారు. ఆధార్‌లో జిల్లాల మార్పు, పేర్లలో తప్పులను సవరిస్తారన్నారు. ఆధార్‌ కేంద్రాల వివరాలకు 9573029869 నంబరులో సంప్రదించాలని సూచించారు. ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధార్‌ నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీవో కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డీఎన్‌వీ రమణ, పీఎంయూ అధికారి మోహన్‌, ప్రదీప్‌కుమార్‌, సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభించిన ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement