ఎయిడ్స్‌పై అవగాహన అవసరం
పాడేరు : హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కేవలం వైద్యపరమైన సమస్యగా మాత్రమే చూడకుండా సామాజిక సవాలు, మానవహక్కుల అంశంగా పరిగణించి అవగాహన పెంచుకొని రోగుల పట్ల వివక్ష మానాలని పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని సోమవారం పాడేరులో నిర్వహించారు. స్థానిక ఐటీడీఏ వద్ద ర్యాలీను ప్రారభించి ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమాహాల్ సెంటర్, పాత బస్టాండ్ మీదుగా కాఫీ హౌస్ వరకు సాగింది. పాత బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. కాఫీ హౌస్ వద్ద అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని అపోహాలు మానుకోవాలన్నారు. ఎయిడ్స్‌కు బయపడకుండా అనుమానం ఉంటే ముందుకు వచ్చి నిర్ధారణ పరీక్షలు, కౌన్సిలింగ్ చేసుకోవాలన్నారు. నిర్ధారణ పరీక్షలు చేసుకుంటే అపోహాలు తొలగుతాయన్నారు. జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కిరణ్‌కుమార్, మెడికల్ కళాశాల ఎస్పీఎం విభాగాధిపతి డాక్టర్ సంద్య, కళాశాల అసిస్టెంట్లు ప్రొఫెసర్లు, పీహెచ్‌సీ వైద్యులు, ఎన్జీఓ ప్రతినిధులు, ఏఎన్‌ఎం ట్రైనింగ్ కళాశాల విద్యార్ధులు, ఆశా కార్యకర్తలు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పాత బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడినవైద్యారోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది
ర్యాలీను ప్రారంభిస్తున్న మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత,
ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్, జిల్లా ఎయిడ్స్, లెప్రసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కిరణ్‌కుమార్
ఎయిడ్స్‌పై అవగాహన అవసరం


