ఖోఖో జాతీయ జట్ల ఎంపిక
అగనంపూడి: ఎస్‌జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనపర్చిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. ఆదివారం రాత్రి లంకెలపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఫైనల్ పోటీల్లో 13 జట్ల నుంచి (195 మందిలో) అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన క్రీడా కారులను కమిటీ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది జనవరి నెల 16 నుంచి 21 వరకు రాజస్థాన్‌లోని కేక్రీలో నిర్వహించనున్న పోటీల్లో రాష్ట్రం తరపున పాల్గొనబోయే జట్టును ప్రకటించారు.
● బాలుర జాతీయ జట్టు : బాలుర విభాగంలో విశాఖ నుంచి జె.హర్షవర్ధన్, జీ.మనోహర్‌నాయుడు, చిత్తూరు నుంచి టి.సూర్యనారాయణ, ఎస్.భద్రీనాథ్, విశాఖ నుంచి టీ.శృతిసాయి కీర్తన్, గుంటూరు నుంచి ఎం.శ్రీకాంత్, కర్నూల్ నుంచి సీ.నగేష్, ప్రకాశం నుంచి వెంకటసాయి, తూర్పు గోదావరి నుంచి ఎ.భూపతిరెడ్డి, శ్రీకాకుళం నుంచి బి.కార్తీక్, కడప నుంచి ఎస్.రామచరణ్, విశాఖ నుంచి కె.చరణ్‌లతోపాటు స్టాండ్‌బైగా మరో ఐదుగుర్ని ఎంపిక చేసినట్టు కమిటీ ప్రతినిధులు బీ.కె.విశ్వనాథ్‌రెడ్డి, ఎం.సురేష్‌నాయుడు, శ్యామ్ తెలిపారు.
● బాలికల జాతీయ జట్టు : జాతీయ ఖోఖో అండర్–14లో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ జట్టును ఎంపిక కమిటీ వెల్లడించింది. విశాఖ నుంచి ఆర్.శృతిక, ఆర్.లలితాదేవి, చిత్తూరు నుంచి ఎం.యువశ్రీ, పి.జయశ్రీ, ఎం.అర్చనరెడ్డి, శ్రీకాకుళం నుంచి జి.చందన, విజయనగరం నుంచి కె.పావని, ప్రకాశం నుంచి టి.సింధు, కృష్ణా జిల్లా నుంచి ఎన్.బంధవిక, కడప నుంచి జీ.అనుపమ, అనంతపురం నుంచి ఆర్.వీణ, తూర్పు గోదావరి నుంచి టి.ప్రియతోపాటు మరో ఐదుగుర్ని స్టాండ్‌బైగా ఎంపిక చేసినట్టు కమిటీ ప్రతినిధులు ఎం.వెంకటేశ్వరరావు, ఎస్.కిరణ్‌కుమార్‌లు తెలిపారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనున్న జట్టును అనకాపల్లి డీఈవో గిడ్డి అప్పారావునాయుడు, డీప్యూటీ డీఈవో పొన్నాడ అప్పారావు, కార్పొరేటర్లు రౌతు శ్రీనివాసరావు, పాఠశాల హెచ్‌ఎం రౌతు నాగేశ్వరరావు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు కె.ఎం.నాయుడు, టి.నాగేశ్వరరావు, జిల్లా వ్యాయామ సంఘం అధ్యక్షుడు చిరికి వెంకటరావు, బొండా శ్రీధర్, పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శి పెద్దినాయుడు, ఎస్‌జీఎఫ్ మాజీ కార్యదర్శి ఎంవీ నాగేశ్వరరావు, పి.లక్ష్మి, మండల ప్రధానోపాధ్యాయులు అభినందించారు.
జాతీయ జట్టుకు ఎంపికై న బాలికల, బాలురులతో డీఈవో, అధికారులు, నిర్వాహకులు, వివిధ సంఘాల నాయకులు
ఖోఖో జాతీయ జట్ల ఎంపిక


