కనులపండువగా అమ్మవారి ఉత్సవం ప్రారంభం
డుంబ్రిగుడ: మండలంలోని సొవ్వ పంచాయతీ కమలబంధ గ్రామంలో గిరిజన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే గంగమ్మతల్లి గ్రామ దేవత పండుగ ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహించే ఈ పండుగ ఉత్సవాలు పూర్తిగా గిరిజన ఆచారలతో జరుగుతాయి. గ్రామ పొలిమేర దగ్గర ఉన్న గ్రామ దేవత గంగమ్మతల్లి గుడి నుంచి జ్యోతిని గ్రామంలో కొలువుదీర్చుతారు. వారం రోజులపాటు స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి జ్యోతిని దర్శించుకొని పూజలు చేశారు.భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాగి పిండితో చేసే వంటకాలను అమ్మవారికి నైవేధ్యంగా సమర్పిస్తారు. అమ్మవారి పండగ ప్రారంభ వేడుక థింసా నృత్యాలు, ఇతరత్రా సాంస్కృతిక కార్యక్రమాలతో సాగింది.
గ్రామ దేవతకు పూజలు చేస్తున్న భక్తులు
కనులపండువగా అమ్మవారి ఉత్సవం ప్రారంభం


