ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు
డుంబ్రిగుడ: మండలంలోని గసభ పంచాయతీ మొర్రిగుడ ఎంపీయూపీ పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు సోమవారం సందరర్శించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నట్టు గసభ మాజీ సర్పంచ్ పాంగి సురేష్‌కుమార్ స్పందనలో కలెక్టర్ దినేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో 227 మంది విద్యార్థులున్నారని, ఉపాధ్యాయుల కొరత ఉన్నట్టు గుర్తించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనం, హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాల తరగతి గదులు, ఆవరణతో పాటు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఇక్కడ నిర్మాణ దశలో ఉన్న పాఠశాల భవనాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో శెట్టి సుందర్‌రావు, ఉపాధ్యాయ సిబ్బంది, సీఆర్‌పీలు తదితరులున్నారు.
ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు


