అదృశ్యమైన విద్యార్థినుల ఆచూకీ లభ్యం
పట్టుకుని వార్డెన్‌కు అప్పగించిన
గూడెంకొత్తవీధి పోలీసులు
గూడెంకొత్తవీఽధి: పాఠశాల నుంచి అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినులను పోలీసులు పట్టుకుని వార్డెన్‌కు అప్పగించారు. స్థానిక ఎస్‌ఐ సురేష్ శనివారం తెలిపిన వివరాలిలాఉన్నాయి. రింతాడ బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు గతనెల 30వ తేదీన ఉదయం ఏడు గంటల సమయంలో గేటు వద్దకు వచ్చారు. వారి వద్ద ఉన్న ఆధార్ కార్డులతో ఆర్టీసీ బస్సు ఎక్కారు. ముగ్గురు విద్యార్థినులు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ప్రత్యేక దృష్టి సారించారు. అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినుల ఆచూకీకోసం ఎస్‌ఐ ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చేపట్టారు. ము గ్గురు విద్యార్థినులు శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్సులో ఉన్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఈ విషయాన్ని ఏఎస్పీ దృష్టికి ఎస్‌ఐ తీసుకువెళ్లారు. విశాఖ నుంచి తీసుకువచ్చి, పాఠశాల వార్డెన్‌కు అప్పగించినట్టు ఎస్‌ఐ తెలిపారు.


