బిర్సా ముండా పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
● రంపచోడవరం పీవో స్మరణ్‌రాజ్
● ఘనంగా బిర్సాముండా జయంతి
రంపచోడవరం: గిరిజన హక్కుల కోసం భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని గిరిజనులు ఎప్పటికీ మరువరాదని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ అన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆయన జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. పీవో స్మరణ్‌రాజ్, ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, డీఎస్పీ సాయిప్రశాంత్, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరావు, చిన్నం బాబు రమేష్, కోసూరి సత్యనారాయణరెడ్డి, ఎస్టీ కమిషన్ డైరెక్టర్ గొర్లె సునీత బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐటీడీఏ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, సర్పంచ్ మంగా బొజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.
చింతూరు: స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శనివారం బిర్సాముండా జయంతిని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ ముందుగా బిర్సాముండాతో పాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన సమరయోధుల త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా వి.ఆర్.పురానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామల వెంకటరామయ్యను ఆయన సత్కరించారు. అనంతరం స్థానిక గురుకుల పాఠశాల ఆవరణలో అధికారులు, విద్యార్థులతో కలిసి పీవో మొక్కలను నాటారు. డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డి, ఏపీవో రామతులసి, ఏవో రాజ్‌కుమార్, ఏఎస్‌డీఎస్ సంస్థ డైరెక్టర్ గాంధీబాబు పాల్గొన్నారు.
బిర్సా ముండా పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం


