ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రత చర్యలు | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రత చర్యలు

Published Wed, May 22 2024 10:20 AM

ఓట్ల

రంపచోడవరం: వచ్చేనెల నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నామని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో మంగళవారం ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులతో ఓట్ల లెక్కింపుపై ఏఎస్పీ జగదీష్‌ అడహళ్లితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ ప్రస్తుతం స్ట్రాంగ్‌ రూమ్‌కు 24 గంటల భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వచ్చేనెల నాలుగో తేదీన కౌంటింగ్‌ జరిగే కేంద్రం దగ్గరకు ఎవ్వరూ రాకూడదని ఆయన తెలిపారు. ఈ విషయం అభ్యర్థులకు సంబంధించిన ప్రతినిధులు, అభిమానులకు ఫోన్‌ మెసేజ్‌ ద్వారా తెలియజేయాలని ఆయన సూచించారు. ఏఎస్పీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అరకు అసెంబ్లీకి..

పాడేరు : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వచ్చేనెల నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని అరకు అసెంబ్లీ ఆర్వో అభిషేక్‌ ఆదేశించారు. అరకు అసెంబ్లీ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు నిర్వహణ, స్ట్రాంగ్‌ రూం నుంచి కౌటింగ్‌ హాలుకు ఈవీఎంల తరలింపుపై అధికారులకు అవగాహన కల్పించారు. కౌంటింగ్‌ హాలులో ఈవీఎంలకు 14 టేబుళ్లు, పోస్టల్‌ బ్యాలెట్ల కోసం మరో మూడు టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ప్రతి కౌటింగ్‌ టేబుల్‌ వద్ద సహాయ రిటర్నింగ్‌ అధికారి, సూపర్‌ వైజర్‌, మరోక సహాయకులు ఉండాలని ఆదేశించారు. అనంతరం ఆయన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూం సీళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రత చర్యలు
1/1

ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రత చర్యలు

Advertisement
 
Advertisement
 
Advertisement