యువతకు ఉపయుక్తంగా ఆడియో ఇంజినీరింగ్‌ కోర్సులు

సంగీత దర్శకుడు కమలాకర్‌ను
సత్కరిస్తున్న ఆశీర్వాద్‌ లూక్స్‌ తదితరులు - Sakshi

ఏయూక్యాంపస్‌: యువతకు ఉపయుక్తంగా ఆడియో ఇంజినీరింగ్‌ కోర్సులు నిలుస్తాయని ప్రముఖ సంగీత దర్శకుడు ప్రాణం కమలాకర్‌ అన్నారు. శుక్రవారం ఏయూలోని సెయింట్‌ లూక్స్‌ ఆడియో ఇంజినీరింగ్‌ మ్యూజిక్‌ ప్రొడక్షన్‌న్‌ విభాగంలో నిర్వహించిన ‘మాస్టర్‌ క్లాస్‌’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఏయూ వర్తమాన సమాజానికి అనుగుణంగా, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఆడియో ఇంజినీరింగ్‌ కోర్సులను అందించడం అభినందనీయమన్నారు. సంగీత రంగంలో ఎందరో నిష్టాతులను అందించిన ఆశీర్వాద్‌ లూక్స్‌ మార్గదర్శకం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు.

కార్యక్రమంలో ఏయూ విద్యార్థులు, సంగీత, నృత్య విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు సంగీత స్వరకల్పనలో వివిధ మెళకువలను వివరించారు. ప్రత్యక్షంగా వేణువుపై పలు స్వరాలకు పలకించి విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో భాగంగా ప్రాణం కమలాకర్‌ను వర్సిటీ తరఫున సత్కరించారు. కార్యక్రమంలో సుమన్‌, సెయింట్‌ లూక్స్‌ నర్సింగ్‌ విద్యా సంస్థల చైర్మనన్‌ ప్రీతమ్‌ లూక్స్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏయూ చూపిన చొరవ అభినందనీయం

సంగీత దర్శకుడు కమలాకర్‌




 

Read also in:
Back to Top