ఐటీడీఏ స్పందనకు వినతుల వెల్లువ

గిరిజనుల నుంచి వినతులు స్వీకరిస్తున్న 
జేసీ శివశ్రీనివాస్‌, ఐటీడీఏ పీవో, సబ్‌కలెక్టర్‌   - Sakshi

● 47 అర్జీలు స్వీకరణ ● జాయింట్‌ కలెక్టర్‌ పర్యవేక్షణలో నిర్వాహణ

సాక్షి,పాడేరు: స్థానిక ఐటీడీఏ సమావేశమందిరంలో శుక్రవారం నిర్వహించిన స్పందనకు వినతులు వెల్లువెత్తాయి. జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాస్‌, సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌, ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలకృష్ణ, గిరిజనుల నుంచి వ్యక్తిగత,గ్రామాల సమస్యలపై 47 వినతులు స్వీకరించారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ శర్మ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జమాల్‌బాషా, ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి, పీఐయూ ఈఈ లావణ్యకుమార్‌, డీఎల్‌పీవో కుమార్‌, ఆర్టీసీ డీఎం నాయుడు, తహసీల్దార్‌ త్రినాథరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

●పెదబయలు మండలం బొంగరం పంచాయతీ పోతులగరువు గెడ్డ నుంచి రాసకొండ బాలచెల్లమ్మ ఆలయం వరకు రోడ్డు నిర్మించాలని జామిగూడ ఎంపీటీసీ నిర్మల విన్నవించారు.

●కిఅంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల మంజూరు చేయాలని ముడుపల్లి పంచాయతీ సావిడిమామిడి గ్రామానికి చెందిన నాగరాజు కోరారు.

●పాడేరు మండలం గొండెలి పంచాయతీ లింగాపుట్టు గ్రామానికి చెందిన పలాసి పిన్నయ్య సాగుభూములకు సర్వే జరిపి పట్టాలు మంజూరు చేయాలని కోరారు.

●ఇరడాపల్లి పంచాయతీ బొడ్డాపుట్టు, సరియాపల్లి గ్రామాలకు జి.మాడుగుల మండలంలోని విద్యుత్‌ లైన్లు తొలగించి, పాడేరు మండలం సోలముల గ్రామం మీదుగా కొత్త లైన్‌ ఇవ్వాలని గుల్లెలి లింగమూర్తి కోరారు.

●గబ్బంగి పంచాయతీ పనసపల్లి గ్రామంలో నిర్మించిన చెక్‌డ్యాం బిల్లులు చెల్లించాలని గొల్లోరి నీలకంఠం కోరారు.

●ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ, బోనంగిపుట్టు గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని ముక్కి రమణ విన్నవించారు




 

Read also in:
Back to Top