ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

- - Sakshi

పనస రామాలయంలో పూజలు చేస్తున్న ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర

ముంచంగిపుట్టు: మండలంలోని వనుగుమ్మ పంచాయతీ పనస గ్రామంలో టీటీడీ నిధులు రూ.20లక్షలతో నిర్మించిన సీతారామాలయాన్ని శుక్రవారం ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర ప్రారంభించారు. అనంతరం సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు.ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ శ్రీరామనవమి పండుగ ముందే రామాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజాలంతా సుభిక్షంగా ఉన్నారని, ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఎప్పుడూ సహకారం ఉంటుందన్నారు. అనంతరం పనస గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులకు అడిగి తెలుసుకున్నారు. వైస్‌ఎంపీపీ భాగ్యవతి,వైసీపీ మండల అధ్యక్షులు మల్లికార్జున్‌,సర్పంచ్‌లు,ఎంపీటీసీలు,మండల వైసీపీ నేతలు, పలు గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top