గిరి గ్రామాల అభివృద్ధే లక్ష్యం

రంగబయలు గిరిజనులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ రవీంద్ర  - Sakshi

ముంచంగిపుట్టు: మారుమూల గిరిజనులు సంఘ విద్రోహ శక్తులకు దూరంగా ఉండి అభివృద్ధి పథంలో నడవాలని ముంచంగిపుట్టు ఎస్‌ఐ కె.రవీంద్ర అన్నారు.మండలంలోని అత్యంత మారుమూల రంగబయలు పంచాయితీ కోసంపుట్టు, మొండిగూ, ధనుబాద్‌, మల్లిపోధర్‌, మట్టిగూడ, బుడపనస, మోజగూడ, నూవగూడ, డెంగిసిమిల్లి, వలజంగి, చంపాపుట్టు, లంగ్భాపోధర్‌, రంగబయలు గ్రామాల్లో గత రెండు రోజులుగా క్యాప్‌–14, పోలీసులు, స్పెషల్‌ పార్టీ పోలీసులు గిరిజనులతో మమేకమై సమావేశాలు నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ,ప్రభుత్వం,పోలీసుశాఖ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు.గిరిజన యువతకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ,ఉపాధి అవకాశాలను వివరిస్తూ వాలీబాల్‌ కిట్లను పంపిణీ చేశారు. గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మందులను అందించి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గంజాయికి దూరంగా ఉండాలని తెలియజేశారు.పలు గ్రామాల్లో తాగునీరు, బీఈ రోడ్డులు, వంటి సమస్యలను ఆ ప్రాంత గిరిజనులు ఎస్‌ఐ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ రవీంద్ర మాట్లాడుతూ మారుమూల గిరిజన పల్లెల అభివృద్ధే లక్ష్మ్యంగా పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తోందన్నారు. ,చట్టవిరుద్దమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని,ఏ సమస్య ఉన్నా పోలీసుల దృష్టికి వచ్చి నిర్భయంగా చెప్పుకోవచ్చు అని అన్నారు.




 

Read also in:
Back to Top