క్షయ రోగులకు ఉన్నత వైద్యం

రోగికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న టీబీ కంట్రోల్‌ అధికారి డాక్టర్‌ విశ్వేశ్వరనాయుడు  - Sakshi

● తగ్గుతున్న వ్యాధి తీవ్రత ● నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం

సాక్షి,పాడేరు: జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2003 ఏప్రిల్‌ 7న ప్రారంభించిన జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం మంచి ఫలితాలివ్వడంతో వ్యాధిని నియంత్రించగలిగింది. జిల్లాలో 11 ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీబీ నిర్థారణ పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి. రెండు వారాలకు మించి దగ్గుతో కూడిన జ్వరం ఉన్న రోగులందరికి వైద్య ఆరోగ్యశాఖ టీబీ పరీక్షలు నిర్వహిస్తోంది. అవసరమైతే ఉచితంగా మందులు అందజేస్తోంది. జిల్లాలోని 22మండలాల్లో టీబీ నియంత్రణ కార్యక్రమాలను వైద్య ఆరోగ్యశాఖ విజయవంతంగా నిర్వహిస్తోంది.

● మొదట్లో ఏజెన్సీలో క్షయ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. పొగాకుతో తయారుచేసే చుట్ట, బీడీ, సిగరెట్‌, తంబాకు వినియోగం వల్లే క్షయ సోకుతుంది. ప్రధానంగా వీటిని గిరిజనులు ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీనిపై ప్రభుత్వ చేపట్టిన అవగాహన కార్యక్రమాలు వారిలో చైతన్యం తెచ్చాయి. క్రమేపీ వ్యాధి తీవ్రతను ప్రభుత్వాలు కట్టడి చేయగలిగాయి.

● 2015లో జిల్లా వ్యాప్తంగా 1106 టీబీ కేసులు నమోదుకాగా 2022 నాటికి 690కు తగ్గింది. ఉన్నత వైద్యసేవలు అందుబాటులో ఉన్నందున వ్యాధి బారిన పడిన వారు సకాలంలో కోలుకుంటున్నారు.

● రాష్ట్ర ప్రభుత్వం రోగులకు పౌష్టికాహారం నిమిత్తం అందిస్తున్న రూ.500 నగదు ఎంతో ఉపశమనాన్ని ఇస్తోంది.

ఉండడంతో రోగులకు సకాలంలో కోలుకుంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం టీబీ రోగులకు ప్రతి నెల పౌష్టికాహారం నిమిత్తం రూ.500 నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంది.




 

Read also in:
Back to Top