అలంకరణ చేపల ఉత్పత్తితో ఉపాధి అవకాశాలు

మాట్లాడుతున్న శాస్త్రవేత్త వీరాంజనేయులు - Sakshi

రంపచోడవరం: అలంకరణ చేపల ఉత్పత్తితో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చని కేవీకే కోఆర్డినేటర్‌,ప్రధాన శాస్త్రవేత్త డా.లలితాకామేశ్వరి సూచించారు. పందిరిమామిడి కేవీకేలో గురువారం అలంకరణ చేపల ఉత్పత్తి, యాజమాన్య పద్ధతులపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్వేరియం నిర్మాణం, వాటి అమరిక, వాటిలో పెంచే చేపల ఉత్పత్తి రంగంలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఇళ్లల్లో రంగుల చేపల పెంపకం ప్యాషన్‌గా మారిందన్నారు.మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సీహెచ్‌ రమేష్‌, కేవీకే శాస్త్రవేత్త లు డా. వీరాంజనేయులు, ఆదర్శ, చిరంజీవి, రాజశేఖర్‌, ప్రవీణ్‌బాబు, అధ్యాపకుడు సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top