కె.కె.లైన్‌లో పలు రైళ్లు రద్దు

తాటిచెట్లపాలెం: వాల్తేర్‌ డివిజన్‌ పరిధి మల్లిగుడ–చత్రిఫుట్‌ సెక్షన్‌ పరిధిలో జరుగుతున్న భద్రత పనుల కారణంగా కె.కె.లైన్‌లో ప్రయాణించే పలు రైళ్లను శుక్ర, శనివారాల్లో రద్దు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులు గమనించి సహకరించాలని వాల్తేర్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కె.త్రిపాఠి కోరారు.

● ఈ నెల 24న విశాఖపట్నం–కిరండూల్‌ (08551) పాసింజర్‌ స్పెషల్‌ రద్దు.

● ఈ నెల 25న కిరండూల్‌–విశాఖపట్నం(08552) పాసింజర్‌ స్పెషల్‌ రద్దు.

● ఈ నెల24న విశాఖపట్నం–కోరాఫుట్‌ (18512) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రద్దు.

● ఈ నెల 24న కోరాఫుట్‌– విశాఖపట్నం (18513) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రద్దు.




 

Read also in:
Back to Top