కై లాస్‌నగర్: నిర్దేశిత లక్ష్యాలను గడువులోపు పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలోనే ప్రగతిపథంలో నిలిపేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ రా జర్షి షా అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో శుక్రవారం జి ల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అవసరాలు గు ర్తించి, తదనుగుణంగా నిధులు కేటాయించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతీ గ్రామాని కి స్పష్టమైన, ఆచరణాత్మక ప్రణాళిక ఉండాలని, ఇందుకోసం మండల, గ్రామస్థాయి అధికారులు స మన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మెగా జాబ్‌మేళా ద్వారా ఎంపికై న అభ్యర్థుల కు నియామక పత్రాలు, పదోతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ జీపీలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇందులో ఐటీడీఏ పీవో మంద మకరంద్, అదనపు కలెక్ట ర్ ఎస్.రాజేశ్వర్, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, జి ల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మెప్మా పీడీ సీవీఎన్.రాజు తదితరులు పాల్గొన్నారు.
సర్వే గడువులోపు పూర్తి చేయాలి
జనగణన సర్వేను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సెన్సెస్ చార్జ్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్స్‌తో శుక్రవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించి ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో సేకరించే ప్రతీ అంశం కచ్చితత్వంతో కూడి ఉండాలని, ఎక్కడా తప్పులకు తావుండకూడదని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, గడువులోపు పూర్తి చేయకపోయినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వీసీలో డీఆర్వో స్రవంతి, సూపరింటెండెంట్ నలంద ప్రియ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు,
ఉత్తమ ఫలితాలు సాధించాలి
రానున్న విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఇందులో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, డీఐఈవో గణేశ్‌జాదవ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.


